బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించగా తాజాగా విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా షంషేరా ఇప్పుడు OTTలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం గత నెలలో విడుదల అయిన ఈ చిత్రం అత్యంత పేలవమైన సమీక్షలను తెచ్చుకుంది. ఇటీవల అన్ని బాలీవుడ్ సినిమాల లాగే మరో భారీ బడ్జెట్ వైఫల్యంగా నిలిచింది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు మరియు భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ వరుసగా వైఫల్యం చెందుతున్న విషయం తెలిసిందే.
షంషేరా సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా మరియు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన షంషేరా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు మరియు తమిళంలో ప్రసారం కాబడుతోంది. యష్ రాజ్ ప్రొడక్షన్స్ ఈ అత్యంత ప్రతిష్టాత్మక సినిమాని భారీ స్థాయిలో నిర్మించింది. సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్, ఎంచుకున్న సబ్జెక్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటే బాక్సాఫీస్ వద్ద తీసుకుంటే ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందని అందరూ అనుకున్నారు.
అయితే ఈ చిత్రం విడుదల రోజునే దారుణమైన స్పందనను సొంతం చేసుకుని బాలీవుడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. రివ్యూస్ లో ఈ సినిమాని విమర్శకులు అందరూ ఏకి పారేశారు. ఈ చిత్రం 1800ల నాటి నేపథ్యంతో రూపొందించబడింది. బ్రిటీష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం కోసం చేసిన ఒక దోపిడీదారుల తెగకు సంభందించిన కథను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో షంషేరా (ఒక గిరిజన తెగ నాయకుడు) మరియు అతని కుమారుడు బాలి (అల్లరి దొంగ) గా ద్విపాత్రాభినయం చేశారు.
నాలుగు సంవత్సరాల తర్వాత రణ్ బీర్ కపూర్ హీరోగా చేసిన సినిమా విడుదల రావడం, అలాగే దర్శకుడు కరణ్ మల్హోత్రా ఏడు సంవత్సరాల తర్వాత దర్శకత్వం వహించడం వలన ఈ సినిమా పై అటు ఇండస్ట్రీ వర్గాలలో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు.