ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల పై రణబీర్ కపూర్ తన ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆయన వ్యాఖ్యలు తన అభిమానులకు మరియు ఇతర తటస్థ ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి. సాధారణంగా రణబీర్ ఏ అంశం అయినా చిన్నపాటి సంకోచం కూడా లేకుండా సూటిగా మాట్లాడటానికి ప్రసిద్ధి చెందారు.
బాలీవుడ్ దంపతులు రణబీర్ కపూర్ మరియు అలియా భట్ ఇటీవల ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి విభాగాల్లో గెలుచుకున్నారు. బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ శివ చిత్రానికి గాను రణ్‌బీర్ అవార్డును కైవసం చేసుకోగా, గంగూబాయి కతియావాడి చిత్రానికి ఆలియా అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డుకు తాను పూర్తిగా అర్హుడిని కానని రణబీర్ అన్నారు. ఇటీవలే చండీగఢ్‌లో తన రాబోయే చిత్రం తు ఝూతి మైన్ మక్కార్ ప్రచార కార్యక్రమంలో, రణ్‌బీర్‌ని తనకి మరియు ఆలియా విజయం గురించి అడిగారు. అయితే, తనకి ఇంత గొప్ప అవార్డు దక్కినందుకు నిజంగా కృతజ్ఞుడనని చెప్తూ.. బ్రహ్మాస్త్ర సినిమాకు వచ్చిన అవార్డుకు నేను పూర్తిగా అర్హుడనని నేను అనుకోను అని అన్నారు.
ఇంకా, ఈ చిత్రంలో తన నటన అంత గొప్పగా లేదని, అయితే ఏదైనా అవార్డు అందుకున్నప్పుడు ఎగరైనా గొప్పగా భావిస్తారని అన్నారు. అయినప్పటికీ, అయన తన భార్య ఆలియాను ప్రశంసించారు మరియు గంగూబాయి కతియావాడిలో తన అద్భుతమైన నటనకు అవార్డుకు ఆమె అర్హురాలని చెప్పారు.
షారూఖ్ ఖాన్ మరియు నాగార్జున అతిధి పాత్రల్లో కనిపించగా, రణ్‌బీర్ కపూర్, అలియా మరియు అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో సినిమా బ్రహ్మాస్త్ర, 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. బ్రహ్మాస్త్ర పార్ట్ టూ – దేవ్ పై సినీ ప్రేమికులు మరియు అభిమానులలో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి, ఇక రణబీర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కైవసం చేసుకోవడం వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది.