తెలుగు హీరోలైన్స్ వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటిలను వారి రెగ్యులర్ ఇమేజ్ కు భిన్నమైన పాత్రల్లో ప్రజెంట్ చేసిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రానా నాయుడు అందరినీ ఆశ్చర్య పరిచింది రానా, నాగా ల జీవితంలో తదుపరి ఏం జరుగుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడటంతో మొదటి సీజన్ చాలా సందడిగా ముగిసింది. తాజాగా రానా నాయుడు 2 అనౌన్స్ చేయడం ద్వారా ఈ క్యూరియాసిటీకి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరదించింది.
అయితే రెండవ సీజన్ ప్రకటన సమయంలో స్ట్రీమింగ్ తేదీ లేదా ట్రైలర్ వంటి ఏ వివరాలనూ వెల్లడించనప్పటికీ, తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం, రానా నాయుడు 2 జనవరి 2024 లో నెట్ ఫ్లిక్స్ లి స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు.
ప్రముఖ అమెరికన్ డ్రామా రే డోనోవన్ యొక్క అనుసరణ అయిన రానా నాయుడుకు కరణ్ అన్షుమన్ మరియు సుపర్న్ వర్మ నాయకత్వం వహించారు. కాగా ఈ సీరీస్ వివాదాలు, నేరాలు, హింస చుట్టూ కథ తిరుగుతుందని అనిపించినా.. దూరమైన తన తండ్రికి వ్యతిరేకంగా ఒక కొడుకు పడే వేదనను చెబుతుంది. రానా, వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించారు.
రానా, నాగాల మధ్య ఉన్న వైరుధ్యం, వారి కుటుంబంలోని అస్తవ్యస్తమైన పరిస్థితులు చూపించే ఈ గ్రిప్పింగ్ స్టోరీలో మరోసారి ప్రేక్షకులు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చీకటి కథాంశంలోని మలుపులుతో ఉర్రూతలూగించే అనుభవాన్ని ఇచ్చే ఆడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ తో వారు మంత్రముగ్ధులవుడానికి వారు ఉవ్విళ్లూరుతున్నారు.