మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన టెలివిజన్ ఛానెల్ ఎన్‌డిటివి నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో చరణ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా (Future of Young India) అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డ్ ఫంక్షన్‌లో రామ్‌చరణ్‌ని ఎన్‌డిటివి ట్రూ లెజెండ్ (True Legend) అవార్డుతో సత్కరించింది.
అదే అవార్డుకు నామినేట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌లను దాటేసి మరీ రామ్ చరణ్ ఈ అవార్డును అందుకోవడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్, అక్షయ్ కుమార్‌లతో పాటు తాప్సీ, సోనూసూద్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయిన జాబితాలో ఉన్నారు.
అవార్డు గెలుచుకున్న తర్వాత రామ్ చరణ్ కాస్త భావోద్వేగంగా మాట్లాడారు. తన తండ్రి బ్లడ్ బ్యాంక్ వెనుక కథను పంచుకుంటూ… “1997లో, సకాలంలో రక్తం సరఫరా కాకపోవడంతో మా కుటుంబానికి చెందిన ఒక స్నేహితుడు మరణించాడు. 20వ శతాబ్దంలో కూడా ఒక వ్యక్తి రక్తం తీసుకోకుండానే చనిపోవడం ఏమిటి ?” ఈ మాటలు చెప్తూ రామ్‌చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు, ఆ సమయంలో తాను షాక్ గు గురయ్యానని చెప్పారు.
“ఆ ఘటన తర్వాత నా తండ్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చొరవ తీసుకొన్నారు. తన పై ప్రేమను చూపించే అభిమానుల సహకారంతో 1998లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఎవరైనా తనతో ఫోటో తీయించుకోవాలంటే.. సొసైటీ కోసం రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి రక్తదానం చేసిన ప్రతీ అభిమానితో ఫోటో దిగే కార్యక్రమాన్ని చెపట్టారు” అని ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును స్వీకరించిన తర్వాత రామ్ చరణ్ చెప్పారు.
ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసి రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
RRRతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన తర్వాత, రామ్ చరణ్ దక్షిణ భారత సినీ పరిశ్రమలో అతిపెద్ద దర్శకులలో ఒకరైన శంకర్‌తో కలి పని చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో 15వ సినిమా, RRR తరువాత సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.