మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శ కత్వంలో తన 15వ చిత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 1000 మందికి పైగా ఫైటర్స్ పాల్గొనే భారీ యాక్షన్ షెడ్యూల్ తో ఈ సినిమా యొక్క క్లైమాక్స్ షూట్ త్వరలోనే పూర్తవుతుందని, ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ షూటింగ్ నుండి పెద్ద విరామం తీసుకుంటారని అంటున్నారు.
రామ్ చరణ్ పెద్ద విరామం తీసుకోవడానికి కారణం తన మొదటి బిడ్డకు స్వాగతం పలకడం కోసమే, ఎందుకంటే ఇది ఎవరి జీవితంలోనైనా అత్యంత విలువైన క్షణం. అలాగే పైన చెప్పిన షెడ్యూల్ తో గేమ్ ఛేంజర్ కు సంబంధించిన చాలా వరకు పనులు పూర్తవుతాయని, విరామం తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు సినిమాలకు సమాంతరంగా పనిచేస్తారని అంటున్నారు.
రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పిన క్షణం నుండి, అభిమాన ప్రపంచం మొత్తం ఈ శుభవార్తను సంబరంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఇటీవల ఈ జంట క్యూట్ బేబీ షవర్ పార్టీ నిర్వహించగా, అది వారు ఒక ఆడబిడ్డకు స్వాగతం పలుకుతున్నారనే పుకార్లకు ఆజ్యం పోసింది. బేబీ షవర్ వేడుక కోసం ఈ కాబోయే తల్లిదండ్రులు పింక్ కలర్ థీమ్ ను ఉంచారు. గులాబీ రంగు సాధారణంగా ఆడపిల్లలకి చిహ్నంగా భావిస్తారు. గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కూడా ఇదే విషయాన్ని చూచాయగా తెలియజేశారు.
ఇక రామ్ చరణ్ నుండి తదుపరి రాబోయే భారీ ప్రాజెక్ట్ దర్శకుడు శంకర్ షణ్ముగం యొక్క గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.