తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథను స్క్రిప్ట్ డిస్కషన్స్ ఫైనల్ మీటింగ్ లో తిరస్కరించారట. ఇటీవలే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చరణ్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చివరికి పూర్తి స్థాయి స్క్రిప్ట్ రామ్ చరణ్ కు నచ్చకపోవడంతో ఫైనల్ మీటింగ్ లో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కన్నడ దర్శకుడు నర్తన్ విషయంలోనూ అదే జరిగిందని తెలుస్తోంది. మొదట నర్తన్ తన స్టోరీ లైన్ తో రామ్ చరణ్ ను ఇంప్రెస్ చేశారని, ఆ తర్వాత వీరిద్దరి మధ్య పలుమార్లు చర్చలు జరిగాయని, అయితే దర్శకుడు కోరుకున్న విధంగా ఆ చర్చల తుది ఫలితం మాత్రం రాలేదని సమాచారం.
స్క్రిప్ట్ ఫైనల్ గా వినిపించిన తర్వాత రామ్ చరణ్ సంతృప్తి చెందలేదని, అందుకే ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేశారని సమాచారం. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ స్క్రిప్ట్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన తర్వాతి సినిమాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జాగ్రత్తగా, చూచాయగా ఉంటున్నారని సమాచారం.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ షణ్ముగం దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ సి 15 లో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఆ తరువాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బుచ్చిబాబు సానా సినిమాలో రామ్ చరణ్ నటించనున్నారు. ఈ ప్రాజెక్టుల తర్వాత ఆయన కన్నడ దర్శకుడు నర్తన్ ప్రాజెక్టులో నటిస్తారని వార్తలు వచ్చాయి, కానీ అనుకొని విధంగా రామ్ చరణ్ ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయడం విచారకరం.