ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అనేక అంశాల కలయికగా ఉంటుంది. స్టార్ డమ్ కోసం కేవలం హిట్ కొడితే సరిపోయే రోజులు పోయాయి. కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యం, అందుకు అల్లు అర్జున్, చిరంజీవిలే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బన్నీ, చిరంజీవి ఇద్దరూ ఖచ్చితంగా కెరీర్ లో ఎంతో కష్టపడ్డ వారే అయినా అందుకు అదునుగా స్మార్ట్ మార్కెటింగ్, పబ్లిసిటీ టెక్నిక్స్ ను కూడా మేళవించి తమ బ్రాండ్ ను పెంచుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇదే పద్ధతి ప్రకారం వెళ్తున్నారు.
రామ్ చరణ్ కు ఇండియా అంతటా తన బ్రాండ్ అప్పీల్ ను పెంచుకోవాలనే లక్ష్యంతో ఆయన యొక్క మార్కెటింగ్ అండ్ పీఆర్ టీం పని చేస్తోంది. సినిమాల ఎంపిక పరంగా, ఆఫ్ స్క్రీన్ పరంగా కూడా వ్యూహాత్మకంగా అన్ని పనులు చేస్తున్నారు.
తన ఇంటర్వ్యూలు, ఇతర పీఆర్ యాక్టివిటీస్ ద్వారా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆర్ఆర్ఆర్ మార్కెట్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది ఆయన తదుపరి సినిమాలకు పెద్ద ప్లస్ అవుతుందని, రాబోయే రోజుల్లో చరణ్ గురించి జాతీయ మీడియాలో మరింత కవరేజ్ చూడటం ఖాయమని అంటున్నారు. చరణ్ కూడా ఇటీవలే తన హాలీవుడ్ ఆకాంక్షలను వ్యక్తం చేశారు మరియు ఇటీవల ఆయన ఇండియా టుడే మరియు ఎబిసి న్యూస్ ఇంటర్వ్యూలను ఇప్పుడు టాలీవుడ్ ను మించిన విషయాల పై దృష్టి పెట్టారనడానికి ఖచ్చితమైన సంకేతంగా చెప్పుకోవచ్చు.
ఇక మెగా అభిమానులు కూడా ఇప్పుడు రామ్ చరణ్ కు ‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్ కోసం గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం తనకు ఉన్న పాపులారిటీ, హాలీవుడ్ లో నటించడానికి ఉన్న ఆసక్తి చూస్తుంటే రామ్ చరణ్ తన తదుపరి సినిమాలకు ఈ ట్యాగ్ ను ఉపయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదనే చెప్పాలి.