మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చరణ్.. ఆ తర్వాత సినిమాగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి సినిమా (RC 15) చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. RC15 సినిమా తాలూకు షూటింగ్ కొన్ని రోజుల ముందే ప్రారంభం కావాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోవటంతో మొదట ఈ సినిమాలో భాగమైన ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ సబ్బాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. ఆ తర్వాత వచ్చిన రవీందర్ రెడ్డి దిల్ రాజు మరియు శంకర్ తో వచ్చిన సృజనాత్మక వ్యతిరేకతల కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఇలా పలు రకాల సమస్యలు సంభవించాయి.
కాగా ఇప్పుడు ముత్తురాజ్ RC 15 సినిమాకు సెట్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ గ్యాప్‌లో శంకర్ కమల్ హాసన్ తో గతంలో మొదలుపెట్టి అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను మళ్ళీ ప్రారంభించాల్సి వచ్చింది. దాంతో ఇక రామ్ చరణ్ తో శంకర్ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే పుకార్లు గట్టిగా వినిపించాయి.
అయితే పుకార్లన్నటికీ శుభం పలుకుతూ అలాంటి వార్తల్లో నిజం లేదని చెబుతూ ఇటీవల శంకర్ ట్వీట్ చేశారు. ఇక RC 15 షూటింగ్ ఆగిపోయిందనే పుకార్లను శంకర్ తోసి పుచ్చిన తరువాత సినిమా షూటింగ్ కు సంబందించిన సమాచారం తాజాగా వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ , వైజాగ్ లో సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. అన్నట్లుగానే ఈరోజు అంటే సెప్టెంబర్ 8న హైదరాబాద్ లోని జెనెటిక్స్ హాస్పిటల్ లో చిత్ర షూటింగ్ జరిగింది ఇక మిగిలిన షూటింగ్ ను హైదరాబాద్ లోనే ఇతర ఏరియాలలో కొనసాగిస్తారట. అలాగే తర్వాత వైజాగ్‌లో కూడా షెడ్యూల్‌ను కంటిన్యూ చేస్తారట. ఆ రకంగా చూసుకుంటే ఇండియన్ 2, రామ్ చరణ్ సినిమాలను ఏక కాలంలో పూర్తి చేసేలా శంకర్ షూటింగ్ షెడ్యూల్ లను ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతానికి RC 15 టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా రోజుల నుంచి రకరకాల పుకార్లు వచ్చాయి. విశ్వంభర, సర్కారోడు, అధికారి.. ఇలాంటి పేర్లు సోషల్ మీడియాలో చాలానే వినిపించాయి. అయితే ఇప్పటి వరకూ టైటిల్ పై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.