కోలీవుడ్ స్టార్ యాక్టర్ రజినీకాంత్ హీరోగా జై భీం ఫేమ్ టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వేట్టయాన్. ఈ మూవీలో దగ్గుబాటి రానా, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈమూవీని అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక వేట్టయాన్ మూవీకి సూపర్ స్టార్ రజినీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న వేట్టయాన్ మూవీ బాగానే బిజినెస్ జరుపుకోవడంతో పాటు ఓపెనింగ్స్ కూడా బాగా రాబట్టింది. కాగా ఈ మూవీ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకోవాలి అంటే ఓవరాల్ గా రూ. 300 కోట్ల గ్రాస్ ని రాబట్టాలి. మరోవైపు వేట్టయాన్ మూవీ ప్రీమియర్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. మరి మొత్తంగా వేట్టయాన్ ఎంతమేర రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.