సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూలి రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్ట్మాకంగా నిర్మితం కానున్న ఈమూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అనిరుద్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. రజిని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా కూలి పై మంచి అంచనాలు ఉన్నాయి. మ్యాటర్ ఏమిటంటే, ఈ ప్రతిష్ట్మాక మూవీ యొక్క రెగ్యులర్ షూట్ ని నేటి నుండి మొదలెట్టనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా తెలిపారు. ఈ మూవీలో రజిని మాస్ లుక్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కథ, కథనాలు అదిరిపోయాయి అంటున్నారు టీమ్.
ఇక మరోవైపు ప్రస్తుతం టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయన్ మూవీ చేస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా దగ్గుబాటి రానా, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాసిల్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ దీనిని భారీ స్థాయిలో నిర్మస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.