టాలీవుడ్ పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన తాజా పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1670 కోట్ల మార్కు వద్ద నిలిచిపోయింది ఈ మూవీ.
అయితే తెలుగు వర్షన్ లో ఈ సినిమా బాగానే రాబట్టగా తమిళ, మలయాళం వర్షన్స్ పెద్దగా రాబట్టలేదు. హిందీలో అయితే భారీ స్థాయిలో కలెక్షన్ రాబట్టింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా తెలుగు వర్షన్ లో జీఎస్టీ ని కలుపుకుని రూ. 213 కోట్ల షేర్ కలెక్ట్ చేసి కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ ని అలానే మరికొన్ని చోట్ల నష్టాలని మిగిల్చింది.
ఓవరాల్ గా అయితే తెలుగు వర్షన్ లో పుష్ప 2 మూవీ రూ. 300 కోట్లు షేర్ ని రాబట్టి, ఆ స్థాయి కలెక్షన్ అందుకున్న మూవీస్ లో మూడవదిగా నిలిచింది. ఒకరకంగా ఇది కల్కి కంటే కూడా తక్కువ అని చెప్పాలి. మరోవైపు ఈ మూవీ హిందీ వర్షన్ అదరగొట్టడంతో పాన్ ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ మరింత క్రేజ్ అయితే సొంతం చేసుకున్నారు.