పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప 1 మూవీకి ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. జగపతిబాబు, అనసూయ, సునీల్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈమూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
విషయం ఏమిటంటే ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా వాటికి భారీ స్థాయిలో క్రేజ్ లభిస్తుంది. ఇక తాజాగా ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ అయిన బుక్ మై షో లో ఫాస్ట్ గా వన్ మిలియన్ టికెట్స్ బుక్ అయిన మూవీగా పుష్ప 2 మూవీ సంచలనం సృష్టించింది.
గతంలో ఈ రికార్డును కలిగి ఉన్న కల్కి 2898 ఏడి, బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది పుష్ప 2. మరోవైపు నార్త్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుంది. బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, పూనే, పాట్నా సహా పలు ప్రాంతాల్లో ఈ మూవీ ప్రీ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. మరి అందరిలో ఈ స్థాయి క్రేజ్ ఏర్పరిచిన పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి