గత నెలలో రష్యాలో విడుదలైన పుష్ప.. 25 రోజులకు 10 మిలియన్ రష్యన్ రూబుల్స్ (భారత కరెన్సీలో 1 కోటి) వసూలు చేసిందని ఆ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం ఇప్పటికీ 774 స్క్రీన్లలో నడుస్తోంది. కాగా ప్రారంభ విడుదలలో కేటాయించిన స్క్రీన్లలో ఎటువంటి తగ్గింపు లేదు.
రష్యాలో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు పుష్ప నిర్మాణ బృందం సినిమా గూర్చి.అక్కడ స్పందన ఎలా ఉంది, ఎంత వసూలు చేసింది వంటి విషయాల గురించి ఏమీ అప్ డేట్ చేయలేదు. అయితే ఈరోజు వారు అకస్మాత్తుగా 1 కోటి గ్రాస్ నంబర్ కలిగిన బ్లాక్ బస్టర్ పోస్టర్ తో వచ్చారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఎలాంటి షేర్ వసూలు చేయలేదని, రష్యాలో విడుదల చేయడం వల్ల మైత్రీ టీమ్ కు తీరని నష్టం వాటిల్లిందని, ఒక వేళ నిర్మాతలు చూపించిన కలెక్షన్లను లెక్కలోకి తీసుకున్నా, కోటి గ్రాస్ కలెక్షన్స్ ద్వారా కనీసం డబ్బింగ్, పబ్లిసిటీ ఖర్చులను కూడా రాబట్టుకోలేకపోయిందని అంటున్నారు.
ఇక మైత్రి టీం పుష్ప డిజాస్టర్ రిజల్ట్ ని బ్లాక్ బస్టర్ గా నిరూపించడానికి హైప్ చేసిన కలెక్షన్లు, పోస్టర్స్ తో ప్రచారం చేస్తోందని వారు అంటున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అభిమానులు, ప్రేక్షకులు ‘పుష్ప ది రూల్’ రెండవ భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి భాగం విడుదలై ఒక సంవత్సరం అయ్యింది, మరియు పుష్ప 2 ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు, మరియు అభిమానులు ఈ చిత్రం తాలూకు గురించి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే పుష్ప 2 గ్లింప్స్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చిత్ర యూనిట్ చిత్రీకరించిందని, కానీ అల్లు అర్జున్ కు ఆ దృశ్యాలు నచ్చకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.