టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీగా నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో పుష్పరాజుగా అల్లు అర్జున్ మార్వెలెస్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు.
ఇక ఫస్ట్ డే ప్రీమియర్స్ నుంచి మంచి అందుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయి కలెక్షన్లని అందుకోలేకపోతోంది. ఇక మిగతా రాష్ట్రాల్లో అలానే ఓవర్సీస్ లో భారీగానే కలెక్షన్ అర్జిస్తోంది. నిజానికి పుష్ప 2 మూవీ చూసిన చాలా మంది సౌత్ వాళ్ళ నుంచి ఒకింత నెగిటివ్ కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. సినిమాలో అల్లు అర్జున్ యాక్ట్ చేసినప్పటికీ స్క్రిప్ట్ టేకింగ్ పరంగా బాగాలేదని చాలావరకు అంశాలు స్టోరీ రిలేటెడ్ గా లేవని అంటున్నారు.
సుకుమార్ నుండి ఎంతో ఆశిస్తే ఈమూవీ నిరాశపరిచిందని పెదవి విరుస్తున్నారు. అందునా ముఖ్యంగా పుష్ప 3 కోసం క్లైమాక్స్ లో ఇచ్చిన లీడ్ ఆసక్తికరంగా లేకపోవడంతో పుష్ప టీం కూడా పార్ట్ 3 మూవీ పై ఒకింత ఆలోచనలో పడింది. ఇక ఒకరకంగా ఈ మూవీ ఆల్మోస్ట్ లేనట్టేనని సుకుమార్ కూడా దానిని విరమించుకున్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో ఆయన రాంచరణ్ తో RC 17 మూవీని చేయనున్నారు.