టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్ లో నిర్మితమైన తాజా పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీపై ఇప్పటికి అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది.
ఇకపోతే దీనికి సీక్వెల్ గా పుష్ప పార్ట్ 3 ఉంటుందనే వార్తలు ఇటీవల మీడియా మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. అలానే ఆ మూవీ ఉంటుందని అందులోని ఒకరిద్దరు నటులు కూడా తెలిపారు. విషయం ఏమిటంటే, తాజాగా రిలీజ్ అయిన ఒక పోస్టర్ ని బట్టి పుష్ప 3 ది ర్యాంపేజ్ మూవీ ఫిక్స్ అని తెలుస్తోంది. ఆ మూవీకి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుష్ప టీంకి సంబంధించిన సభ్యులు అందరూ పాల్గొన్న ఒక సెషన్ లో భాగంగా పుష్ప 3 ది రాంపేజ్ పోస్ట్ర్ అయితే మనం చూడవచ్చు.
అయితే ఈ మూవీ పక్కాగా ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. మరోవైపు పుష్ప 2 అనంతరం ఇప్పటికె త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక భారీ మైథాలజికల్ యాక్షన్ మూవీ మరోవైపు సందీప్ రెడ్డి వంగతో మరొక సినిమా కూడా కమిట్ అయి ఉన్నారు అల్లు అర్జున్. మరి అవి పూర్తయిన అనంతరం పుష్ప 3 మూవీ పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.