టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే.
ఈ మూవీలో ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సినీ, అనసూయ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న పుష్ప 2 మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, రెండు గ్లింప్స్ టీజర్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. కాగా మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని నవంబర్ 17న పాట్నా లో ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేయనున్నారు.
అయితే ఈ ట్రైలర్ యొక్క రన్ టైం లాక్ అయింది. కాగా ట్రైలర్ 2 నిమిషాల 44 సెకండ్స్ పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక పుష్ప 2 మూవీ రిలీజ్ తరువాత అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం పుష్ప 2 ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.