అల్లు అర్జున్ నటించిన తాజా భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయి చేరాయి. ఇక నేడు పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే అనేక ఏరియాల్లో ఏ మూవీ అదరగొట్టింది.
కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ ఓవరాల్ గా ఎంత సొంతం చేసుకుంటుంది అనేది నేడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ టేకింగ్ పరంగా అంతగా ఆకట్టుకోనప్పటికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మార్క్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో ఎంతో అద్భుతంగా నటించి అందరి మనసులు గెలిచారు.
ఇప్పటికే పుష్ప 1 మూవీలో యాక్టింగ్ తో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఈ మూవీతో మరొక్కసారి ఆ అవార్డు అందుకోవడం ఖాయం అనేది చాలామంది అభిప్రాయం. ఇక పుష్ప 2 మూవీకి దాదాపుగా అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఫస్ట్ డే కూడా భారీ నంబర్స్ రానుండడంతో ఇది ఓవరాల్ గా రూ. 1500 కోట్లకు పైగా రాబట్టే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాగా బాహుబలి 2 మూవీ రూ. 1800 కోట్లతో టాప్ స్థానంలో నిలవగా రాబోయే రోజుల్లో పుష్ప 2 ఎక్కడివరకు వెళుతుందనేది చూడాలి.