టాలీవుడ్ స్టైల్ సైకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. రేపు గ్రాండ్ గా ఈ మూవీ పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే నేడు రాత్రి 9:30 నుంచి పలు ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శన కానున్నాయి. మరోవైపు ప్రీమియర్ టికెట్స్ పరంగా పుష్ప 2 స్ట్రగుల్ అవుతోంది.
ఇక ఈ సినిమా ప్రీమియర్స్ కి టికెట్ ధర రూ. 900 నుండి రూ.1200 లుగా నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఇవి ఇప్పటివరకు కూడా 50% మాత్రమే ఆక్యుపెన్సీ కలిగి ఉన్నాయి. ధరలు చాలా ఎక్కువ ఉండటంతో కొందరు అభిమానులు సైతం అవి కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.
మరోవైపు మెగా ఫ్యాన్స్ తో కోల్డ్ వార్ కొనసాగుతూ ఉండటంతో వారు కూడా ఈ టికెట్స్ ని కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. ఒకరకంగా చూస్తే ప్రీమియర్స్ పరంగా పుష్ప 2 కి ఒకంత దెబ్బ అయితే పడేలా కనపడుతుంది. అయితే మంచి టాక్ కనుక లభిస్తే ఈ సినిమా రేపటి నుంచి భారీ స్థాయి కలెక్షన్ అందుకునే అవకాశం గట్టిగా కనబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు