సినిమా పేరు: పుష్ప 2 ది రూల్
రేటింగ్: 2.75 / 5
తారాగణం: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్
దర్శకుడు: సుకుమార్
నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీ: 5 డిసెంబర్ 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 కోసం ఎప్పటి నుండో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఎందరో ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక నిన్న రాత్రి మూవీ యొక్క ప్రీమియర్స్ పలు ప్రాంతనాల్లో ప్రదర్శితం అయ్యాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మరి అందరిలో ఎంతో క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
పుష్ప సిండికేట్ లీడర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం ద్వారా మూవీ మొదలవుతుంది. అయితే ముఖ్యమంత్రితో ఫోటో దిగాలన్న తన భార్య కోరికను తీర్చే ప్రయత్నం చేయడంతో సినిమా ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. పుష్ప ఆమె కలను ఎలా నెరవేరుస్తాడు మరియు అతను ఆ సమయంలో ఎదుర్కొనే పరిణామాలు ఈ మూవీ యొక్క మిగతా కథ
విశ్లేషణ :
ముఖ్యంగా మనం ఈమూవీలో చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ఇప్పటికే పుష్ప మూవీలో టైటిల్ రోల్ లో అదరగొట్టిన ఆయన ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక దానిని మించేలా ఈ సీక్వెల్ లో మరింతగా అదరగొట్టారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. కీలకమైన పాల సన్నివేశాల్లో ఆయన యాక్టింగ్ కి ఎంతటివారైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, మ్యానరిజం, మరీ ముఖ్యంగా జాతర సీన్ లో అయితే అదరగొట్టారు. ఇక హీరోయిన్ రష్మిక మందన్న కూడా అందంతో పాటు తన పాత్రలో ఆకట్టుకునే పెరఫార్మన్క్ కనబరిచి అలరించారు. అయితే కథ, కథనం పరంగా చూసుకుంటే జాతర ఎపిసోడ్ వరకు బాగానే సాగిన సినిమా, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ చేరువరకు అంతగా ఆకట్టుకోదు. ఇక క్లైమాక్స్ లో పార్ట్ 3 కోసం పెట్టిన సీన్ బాగాలేదు. ఇక మంచి పాయింట్ ఎంచుకుని హీరోని హీరోయిజాన్ని యాక్షన్ మాస్ సీన్స్ ని బాగా రాసుకున్న సుకుమార్ ఈ మూవీలో తన మార్క్ ని మాత్రం మిస్ అయ్యారు.
ప్లస్ పాయింట్స్ :
- అల్లు అర్జున్ అద్భుతమైన నటన
- జాతర ఎపిసోడ్
- పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- ప్రీ ఇంటర్వెల్ మరియు పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్సులు
- రష్మిక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
- బలహీనమైన పాత్రలు
- సుదీర్ఘ రన్‌టైమ్
- సాధారణ కథాంశం మరియు ఎమోషనల్ డెప్త్ లేకపోవం
- పుష్ప 3 క్లిఫ్ హ్యాంగర్‌కు దారితీసే చివరి 40 నిమిషాలు
- పరిష్కరించబడని కొన్ని పాత్రలు
తీర్పు :
మొత్తంగా చూసుకుంటే ఎన్నో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన పుష్ప 3 మూవీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే సాధారణ ఆడియన్స్ కి మాత్రం యావరేజ్ అనిపించొచ్చు. అల్లు అర్జున్ సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రష్మిక పెర్ఫార్మన్స్ వంటివి బాగున్నాయి. మొత్తంగా సుకుమార్ చేసిన ఈ ప్రయత్నం అయితే బాగుంది.