మన తెలుగు హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ దీనిని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై. రవిశంకర్, నవీన్ ఏర్నేని భారీ స్థాయిలో నిర్మిస్తున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని ఇటీవల మేకర్స్ అయితే ప్రకటించారు.
ఇక నేడు పుష్ప 2 టీం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భాగంగా వారు మాట్లాడుతూ సినిమా యొక్క రిలీజ్ ని ఒకరోజు ముందుగా అనగా డిసెంబర్ 5న తమ సినిమాని గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అలానే ఈ సినిమాకు సంబంధించి ముందు రోజు అనగా డిసెంబర్ 4 మా చాలా ఏరియాలో ప్రీమియర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఇప్పటికే విడుదల కాగా నవంబర్ నుంచి ఈ సినిమాలో మిగిలిన రెండు సాంగ్స్ తో పాటు ట్రైలర్, ఇతర ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాలు ఆడియన్స్ ని అలరించేలా రూపొందిన పుష్ప 2 బ్లాక్ బస్టర్ విజయం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేసారు.