టాలీవుడ్ స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 2 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. అందరిలో మంచి కలిగిన ఈ మూవీలో ఫహాద్ ఫాసిల్, అజయ్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.
ఇక ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ అలరించి మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా సంచలనం సృష్టించింది. నిజానికి నాన్ రాజమౌళి మూవీగా దీనికి ఇంత భారీ స్థాయిలో బిజినెస్ జరగడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.
అయితే మ్యాటర్ ఏమిటంటే, మరొక రెండు రోజుల్లో అనగా అక్టోబర్ 24న పుష్ప 2 టీమ్ వారి ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ఉండనుందట. ఆ మీట్ లో మూవీ ట్రైలర్, ఇతర సాంగ్స్, మూవీ రిలీజ్ కి సంబంధించి అన్ని అంశాలను టీమ్ వివరించనుందని అంటున్నారు. ఇక డిసెంబర్ 6న పుష్ప 2 మూవీ గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా పుష్ప 2 కి సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం డే 1 నుండి క్లోసింగ్ వరకు కలెక్షన్స్ సునామి ఖాయం అని చెప్పాలి.