టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అనరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఫహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే పుష్ప 2 నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు మరింతగా పెంచేసాయి. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క షూట్ మొత్తం కూడా అక్టోబర్ ఎండ్ కల్లా పూర్తి కానుంది.
అలానే మూవీలో మొత్తంగా నాలుగు సాంగ్స్ ఉండగా భారీ యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాయట. అయితే ప్రత్యేకమైన జాతర సాంగ్ ని డైరెక్ట్ గా మూవీలోనే ప్రదర్శిస్తారట. మరి డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.