టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం సొంతం చేసుకున్న పుష్ప 1 కి సీక్వెల్ గా రూపొందుతోన్న పుష్ప 2 పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఫహాద్ ఫాసిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇక ఈ మూవీని డిసెంబర్ 6న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక గేమ్ ఛేంజర్ మూవీ డిసెంబర్ 20న వస్తుందనుకుంటే దానిని 2025 సంక్రాంతికి వాయిదా వేశారు. దీనితో పుష్ప 2 దాదాపుగా నెలరోజులు బాక్సాఫీస్ వద్ద తన హవా చూపించనుంది. మరోవైపు పుష్ప 2 మూవీ ఆంధ్రప్రదేశ్ లో రూ. 85 కోట్ల భారీ బిజినెస్ తో పాటు నైజాంలో రూ. 80 కోట్ల మేర బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది.
అలానే అటు సీడెడ్ లో ఈ మూవీ రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరుపుకున్నట్లు చెప్తున్నారు. దీనిని బట్టి మొత్తంగా పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో రూ. 200 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటోంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంత మేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.