Homeసినిమా వార్తలుపుష్ప 2 డైలాగ్ లీక్ - వైరల్ అయి సంచలనం

పుష్ప 2 డైలాగ్ లీక్ – వైరల్ అయి సంచలనం

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క రెండవ భాగం అయిన పుష్ప ది రూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది.

ఈ రోజే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఒకే సారి అన్ని భాషల్లో విడుదల చేసి ట్రెండ్ సెట్ చేయాలనే భారీ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. కాగా ఇటీవలే ఈ సినిమా సెట్స్ నుండి కొన్ని డైలాగులు లీక్ అయ్యాయి. “అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసినట్లయితే, పులి వచ్చిందని అర్థం.. అదే పులి వెనకడుగు వేస్తే పుష్పరాజ్ వచ్చాడని అర్థం” అనే సుదీర్ఘ డైలాగ్ ను లీక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఈ డైలాగ్ వైరల్ గా మారింది. అంతే కాదు ఈ సినిమాలో పవర్ ఫుల్ మాస్ ఎక్స్ చేంజ్ లకు కొదవలేదని అంటున్నారు. “గొర్రెలను కాయడానికి వచ్చారు. ఆ గొర్రెలను తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” అని పుష్పరాజ్ డైలాగ్ కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది.

పుష్ప 2 లో ఇలాంటి మాస్ డైలాగులు చాలా ఉన్నాయని సమాచారం. తాజాగా లీక్ అయిన అడవికి సంబంధించిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ డైలాగ్ పై పుష్ప టీం ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

READ  రష్యా ప్రేక్షకులను పుష్ప ఆకట్టుకుంటుందా?

పుష్ప ది రైజ్ లో నటించిన రష్మిక మందన్న పుష్ప ది రూల్ లో కూడా బన్నీ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరికొంత మంది టాప్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories