ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైలర్ మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న ఈ మూవీ గ్రాండ్ గా పలుభాషల ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం హైదరాబాదులో గ్రాండ్ గా జరగనుంది. మరోవైపు పుష్ప 2 కు సంబంధించిన డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా అయితే రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ ఇండియాలో రూ. 35 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్ అయితే పూర్తి చేసుకుంది. ఇక ఓపెనింగ్ డే ఓవర్సీస్ నుంచి రూ. 30 కోట్లు కలగలుపుకొని మొత్తం రూ. 65 కోట్లు రాబట్టే అవకాశం కనబడుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కావాల్సి ఉంది.
ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది అడ్వాన్స్ పరంగా ప్రీమియర్లు కలగలుపుకొని రూ. 150 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా పుష్ప 2 మూవీ బ్రేకీవెన్ ని చేరుకోవడానికి రూ. 1300 కోట్ల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంది. అయితే మూవీకి మంచి పాజిటివ్ టాక్ కనుక లభించినట్లయితే ఇది ఏమాత్రం కష్టమేమీ కాదని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి