ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దీనిని తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో ఫహాద్ ఫాసిల్, అజయ్, సునీల్, అనసూయ, రావు రమేష్, జగపతి బాబు నటించారు.
ఇక నేడు రిలీజ్ అయిన ఈమూవీ అందరి నుండి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ పెరఫార్మన్స్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. సుకుమార్ టేకింగ్ పెద్దగా లేనప్పటికీ ఫ్యాన్స్ కి నార్మల్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగానే రీచ్ అయ్యే అవకాశం కనపడుతోంది.
కాగా ఇప్పటికే ప్రముఖ టిక్కెటింగ్ యాప్ బుక్ మై షో లో ప్రీ టికెట్ సేల్స్ పరంగా 3 మిలియన్ టికెట్స్ సేల్ అయిన మూవీగా రికార్డు సొంతం చేసుకోగా తాజాగా మరొక రికార్డు ఈ మూవీ యొక్క ఖాతాలో చేరింది. ఇదే టిక్కెటింగ్ యాప్ లో ఒక గంటలో 1 లక్ష టికెట్స్ బుక్ చేసుకున్న మూవీగా ఇది ఇండియా వైడ్ సంచలనంగా నిలిచింది.. మొత్తంగా పుష్ప 2 మూవీ వరుసగా ఈ విధంగా రికార్డ్స్ నెలకొల్పుతుండడం మరోవైపు ఆడియన్స్ మూవీకి మంచి రెస్పాన్స్ అందిస్తుండడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.