ఈ మధ్య జరుగుతున్న చిన్న సినిమాల ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లను గమనిస్తే, ఒక విషయం కామన్ గా ఉంటుంది. ఆయా ఫంక్షన్లో సంఘటనలు పునరావృతమవుతున్నాయి మరియు అల్లు అర్జున్ తన స్వంత ప్రొడక్షన్‌లో గీతా ఆర్ట్స్‌లో నిర్మిస్తున్న చిన్న / మధ్య తరహా చిత్రాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నప్పుడు ఎక్కువగా అవే విషయాలు జరుగుతున్నాయి.
నిన్న, నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజేస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, పైన చెప్పినట్లుగా, ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్ వేదిక పైకి రాబోతున్నప్పుడు ఆయన వ్యక్తిగత సిబ్బంది డ్యాన్స్ చేస్తూ ఆయనని కాసేపు నిలబడి ఉండేలా చేశారు.
అయితే ఈ ఉదంతం అంతా ఉద్దేశపూర్వకంగా పీఆర్ చేసిన ప్రయత్నంలా కనిపించిందని చూసిన ప్రేక్షకులు భావించారు. అల్లు అర్జున్ ఎంట్రీ మొత్తం ఒక ప్లాన్ ప్రకారం చేయబడిందని వారు అంటున్నారు.
అలాగే అల్లు అర్జున్ స్పీచ్ ఇచ్చే సమయంలో మరియు మరో నిర్మాత SKN స్పీచ్ ఇచ్చే సమయంలో పుష్ప 2 మరియు అల్లు అర్జున్ గురించి ఓవర్ హైప్ ఇవ్వడం జరిగింది. ఇది చూసిన వారికి ఇది 18 పేజేస్ సినిమా ఫంక్షన్ ఆ లేదా అల్లు అర్జున్ సొంత ఫంక్షన్ ఆ అనే ఫీలింగ్ ఇచ్చింది.
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ప్రసంగాన్ని కూడా అల్లు అర్జున్ అభిమానులు అడ్డుకున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాంటి పని చేసేవారు. కాగా అందుకు వారు తీవ్ర విమర్శలను ఎదుర్కోవడం కూడా జరిగింది. ఒకానొక సమయంలో హీరో అల్లు అర్జున్ యే పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ విషయంలో ఖండించారు.
18 పేజేస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్, పుష్ప గురించి చేసిన సెల్ఫ్ ప్రమోషన్స్ అన్నీ చూసిన ప్రేక్షకులు.. తమ ఫంక్షన్ కు వచ్చిన చీఫ్ గెస్ట్‌ని మెచ్చుకోవడం అనేది మంచి విషయమే కానీ దేనికైనా ఒక హద్దు ఉండాలి అంటున్నారు.
సినిమా కంటెంట్‌ని కాకుండా, నిర్మాతలు అల్లు అర్జున్‌ని పొగడ్తలతో ముంచెత్తుతూ మరియు ఆయన చిత్రం పుష్ప ది రూల్ ను ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మరియు ఆయన టీమ్ ఇటువంటి విషయాలు మరొక ఫంక్షన్‌లో పునరావృతం కాకుండా చూసుకుంటే అందరికీ మంచిది.