Homeసినిమా వార్తలునిర్మాతలకు ఇబ్బందులు తెచ్చిన OTT సంస్థల కొత్త నిర్ణయం

నిర్మాతలకు ఇబ్బందులు తెచ్చిన OTT సంస్థల కొత్త నిర్ణయం

- Advertisement -

కొన్ని వారాల క్రితం టాలీవుడ్ నిర్మాతల గిల్డ్ ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌లను కొద్ది రోజులు నిలిపివేసి మళ్ళీ బంద్ ను విరమించుకున్నారు. కరోనా తరువాత పరిశ్రమలో నెలకొన్న సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. అందుకు పరిష్కారంగా క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికం తగ్గింపు, మరియు ఓటిటి విడుదల పరిధి పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే అన్ని సినిమాలు బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేయడానికి తెలుగు సినిమా నిర్మాతలు అందరూ సమిష్టిగా బడ్జెట్‌ను తగ్గించాలని నిర్మాతల సంఘం భావించింది. స్టార్ హీరోలు, దర్శకుల పారితోషికాన్ని తగ్గించడం ఒక్కటే మార్గమని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ దిల్ రాజు పేర్కొన్నారు. అయితే ఈ విషయం పై ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వటం జరగలేదు.

ఇటీవలే సమ్మె విరమిస్తూ నిర్మాతల సంఘం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఓటిటి విడుదల యొక్క వ్యవధిని ఎనిమిది వారాలకు పొడిగించాలని మేము నిర్ణయించుకున్నాము. ఇకపై, చిత్ర నిర్మాతలు అందరూ ఈ నియమానికి కట్టుబడి ఉంటారు. అంతే కాక ఎవరూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే ప్రశ్నే లేదని దిల్ రాజు తెలిపారు. అలాగే ఇప్పటికే ఉన్న సినిమా తాలూకు ఒప్పందాలను మాత్రం కొనసాగిస్తున్నామని, అంతగా అవసరమైతే, కొత్త నిభందనలు వెంటనే అమలులోకి వచ్చే విధంగా ఒప్పందం తాలూకు షరతులను మారుస్తామని దిల్ రాజు అన్నారు.

అయితే, ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతల నిర్ణయాలతో పూర్తిగా ఏకీభవించినట్లు కనిపించడం లేదు. దాంతో వారు తమ వైపు నుంచి ప్రత్యామ్నాయ దారిని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలను సినిమాకు నేరుగా ఓటిటిలో కాకుండా ఖచ్చితంగా ముందుగా థియేటర్‌లలోనే విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఆ తరువాత ఆయా సినిమాల ఫలితం ఆధారంగా వారు ఒప్పందం రేటును సర్దుబాటు చేయబోతున్నారట. ఓటిటి సంస్థల ఈ కొత్త ప్రతిపాదనతో నిర్మాతలు ఏమాత్రం సుముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి.

READ  కార్తికేయ-2 విజయం నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం - అభిషేక్ అగ‌ర్వాల్

అయితే ఇక్కడ ఓటిటి సంస్థలను తప్పు బట్టడానికి ఏమీ లేదు. కరోనా నేపథ్యంలో నేరుగా వారి ప్లాట్ఫారం లలో సినిమాలు విడుదలయిన కారణంగా అప్పుడు అధిక ధరకు సినిమాలను కొన్నా బాగానే గిట్టుబాటు అయ్యాయి. అంతే కాకుండా మూడు, నాలుగు వారాల్లోనే సినిమాలు ఓటిటి లోకి వచ్చేయడం కూడా వారికి కలిసి వచ్చింది. ఇప్పుడు నిర్మాతలు ఖచ్చితంగా ఎనిమిది వారాల గడువు నిబంధన విధించడంతో ఓటిటి సంస్థలు కూడా తమ రేట్లు తగ్గించడంలో న్యాయం లేకపోలేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  లాల్ సింగ్ చడ్డా ఫలితం చిరంజీవికి ముందే తెలుసా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories