తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సురేష్ బాబు తాజాగా వైజాగ్‌లోని తన అధీనంలో ఉన్న ప్రముఖ సినిమా థియేటర్ అమ్మేసినట్లు తెలుస్తోంది.
ఇదేమి కొత్త విషయం కాదు. ఏదైనా ధియేటర్ ఏళ్ళ తరబడి కొనసాగిన తరువాత పాతబడిన తరుణంలో ఆ ధియేటర్ ను అమ్మేసి కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం సర్వ సాధారణంగా జరిగేదే. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో థియేటర్లు జనంతో కిటకిటలాడేవి. కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు ఒక పండుగ వాతావరణం ఏర్పడేది. థియేటర్ల చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఆ సందడి కనిపిస్తూ.. ఓహో కొత్త సినిమా విడుదల అయింది అనేలా సంబరాలు జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేతు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది.
చాలా కాలం నుంచి థియేటర్లు మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని సినీ పరిశ్రమలో అనేక మంది నిర్మాతలు మొర పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ఫ్లాట్ ఫారం ల ఎదుగుదల, పెరిగిన సినిమా థియేటర్ల టికెట్ రేట్లు మరియు తినుబండారాల ధరలు ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఏదో అద్భుతమైన లేదా ప్రత్యేకమైన సినిమా వస్తే తప్ప ప్రేక్షకులు ఇళ్ల నుంచి బయటకి కదలట్లేదు.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా థియేటర్లు మూసి వేయబడ్డాయి. కొన్ని థియేటర్లు మరమ్మతులు చేపటట్టిన తర్వాత తెరుచుకంటే.. మరికొన్ని మాత్రం శాశ్వతంగా మూతపడిపోయాయి. ఈ క్రమంలో కొందరు యజమానులు థియేటర్లను నడిపించే స్థోమత లేక మంచి ధరకు బేరం దొరికితే అమ్మేస్తున్నారు.
ఈ దశలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆయన ఓ థియేటర్‌ను తాజాగా అమ్మేసినట్లు సమాచారం. థియేటర్లు గత కొంతకాలంగా సరిగా నడవలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సురేష్ బాబు థియేటర్ అమ్మేసినట్లు తెలుస్తోంది.
సురేష్ బాబు అమ్మిన థియేటర్ మరేదో కాదు..విశాఖపట్నం లోని జ్యోతి థియేటర్ . ఈ థియేటర్ యజమాని అయిన సురేష్ బాబు.. విజయనగరానికి చెందిన కొందరు వ్యాపారులకు ధియేటర్ ను విక్రయించారు అని ప్రచారం జరుగుతోంది. జ్యోతి థియేటర్ కూల్చి వేసి అక్కడ పది అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మించడానికి ఆ ప్రాపర్టీని కొనుక్కున్న వ్యాపారుల సిద్ధమవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ధియేటర్ స్థానంలో హౌసింగ్ అపార్ట్మెంట్లతో పాటు సాఫ్ట్వేర్ ఆఫీస్ స్పేస్, కమర్షియల్ షాపులు వచ్చేలా ఆ కాంప్లెక్స్ డిజైన్ చేయబోతున్నారని తెలుస్తోంది.