ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వం ప్రాజెక్ట్ కే ప్రస్తుతం చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ సినిమా నుండి ప్రేక్షకులు కొన్ని ఉత్తేజకరమైన అప్‌డేట్‌ల కోసం ఎదురు చూస్తున్నారు, అయితే నిర్మాతలు క్యారెక్టర్ లుక్స్ మరియు ప్లాట్ లీక్‌లకు సంబంధించిన ఏ విషయం కూడా అకాలంగా బహిర్గతం కాకుండా చూసుకున్నారు. నిర్మాత అశ్విని దత్ మాత్రం అప్పుడప్పుడూ కొన్ని స్టేట్‌మెంట్‌ల ద్వారా సినిమాకి సంభందించిన విషయల గురించి అప్‌డేట్‌లను పంచుకుంటున్నారు మరియు తాజాగా ఆయన మరిన్ని వివరాలు పంచుకున్నారు.
ఈ చిత్ర సంగీతం గురించి సీనియర్ నిర్మాత మాట్లాడుతూ, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సంగీతాన్ని అందించడానికి ఎంచుకున్నామని తెలిపారు. అలాగ ఒక బాలీవుడ్ లేడీ మ్యూజిషియన్‌ని కూడా తీసుకున్నామనీ తెలిపారు. కాగా ఇప్పటి వరకూ ఈ సినిమా యొక్క స్టార్ తారాగణం తాలూకు సుదీర్ఘ జాబితాను ప్రకటించలేదని చెప్తూ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామన్నారు.
కాగా ప్రాజెక్ట్ కే షూటింగ్ ప్రస్తుతం 70% పూర్తయిందనీ, ఇక 5 VFX కంపెనీలతో కలిసి VFX పనిని 5 నెలల క్రితం ప్రారంభించామని ఆయన తెలియజేశారు. అమితాబ్ బచ్చన్, దీపికా కూడా త్వరలో షూట్‌లో జాయిన్ అవుతారని చెప్పిన అశ్విని దత్.. వారి షూటింగ్ భాగంలో కేవలం 7-10 రోజుల పని మాత్రమే మిగిలి ఉంది అని ఆయన తెలిపారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12, 2024న విడుదల కానుంది.
సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని అశ్విని దత్ పంచుకున్నారు. ప్రాజెక్ట్ కే చూస్తున్నప్పుడు, ప్రేక్షకులకు ఈ దృశ్యాన్ని లేదా సీక్వెన్స్‌ను ఇంతకు ముందు చూసినట్లుగా అనిపించదని అన్నారు. అలాగే అమెరికా, దక్షిణాఫ్రికాలతో పాటు మన దేశం నుండి కొంతమంది ఫైట్ మాస్టర్‌లను తీసుకువచ్చారు కాబట్టి పోరాటాలు ప్రత్యేకమైన విధంగా ఉంటాయని అశ్విని దత్ అన్నారు.