Homeసినిమా వార్తలుRC15: రామ్ చరణ్ - శంకర్ సినిమా చుట్టూ సమస్యలు

RC15: రామ్ చరణ్ – శంకర్ సినిమా చుట్టూ సమస్యలు

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్లో సినిమా ఎంతో క్రేజ్ తో మొదలయింది. అయితే ప్రస్తుతం ఆ సినిమాకి అన్నీ సమస్యలే వస్తున్నాయి. లోగడ ఒకసారి కొన్ని తెలియని కారణాల వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణను ప్రొడక్షన్ హౌస్ తొలగించింది.

తర్వాత ఆయన స్థానంలో జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డిని ఎంపిక చేసుకున్నారు.ఈగ, మగధీర వంటి భారీ చిత్రాలతో తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన రవీందర్ రెడ్డి ఆర్‌సి 15 చిత్ర బృందం చేరారు. అయితే ఇప్పుడు నిర్మాత దిల్ రాజుతో విభేదాల కారణంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, జూలైలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో విలాసవంతమైన విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి లొకేషన్‌ల కోసం అన్వేషణ ప్రారంభించారట. కాగా శంషాబాద్‌లో కొంత ఖాళీ స్థలాన్ని గుర్తించి అక్కడ యూనివర్సిటీ సెట్‌ను నిర్మించడం కూడా ప్రారంభించారట.

READ  ఎన్టీఆర్ 30 పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ రామ్

అయితే, సెట్ల నిర్మాణ సమయంలో, దిల్ రాజు – రవిందర్ కు మధ్య సృజనాత్మక విభేదాలు మరియు లావాదేవీల తేడాలు పెరుగుతూ వచ్చాయట. రవీందర్ టీమ్‌కి, దిల్ రాజు టీమ్‌కి మధ్య అభిప్రాయ బేధాలు తలెట్టాయట. ఇరు పక్షాలకు మధ్య సమస్యలు ఉన్నాయని రవీందర్ అన్నారు. రాజీ కోసం ప్రయత్నించే ఉద్దేశ్యం దిల్ రాజు బృందంలో లేదని, అటు వైపు నుండి ఎవరూ స్పందించలేదని కూడా ఆయన అన్నారు.

ఈ కారణాలన్నింటి కారణంగా, రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ పాత్ర నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయానికి దిల్ రాజు కూడా ఒప్పుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఒక పక్క యూనివర్శిటీ సెట్ సిద్ధంగా ఉండగా, షూటింగ్ ప్రారంభించాల్సిన దశలో శంకర్ ఈ చిత్రాన్ని వదిలేసి ప్రస్తుతం భారతీయుడు 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారతీయుడు 2 సినిమా షూటింగును ముగించుకుని ఆ తరువాతే RC15 సెట్స్ లోకి తిరిగి అడుగు పెడతారట.

READ  మాచర్ల నియోజకవర్గం ఓటిటి రిలీజ్ డేట్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories