Homeసినిమా వార్తలులోకేష్ కనకరాజ్ LCU లో భాగం కానున్న ప్రియాంక మోహన్

లోకేష్ కనకరాజ్ LCU లో భాగం కానున్న ప్రియాంక మోహన్

- Advertisement -

కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ LCU గురించి మనందరికీ తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమా తీస్తున్న లోకేష్ దాని అనంతరం ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు తీయనున్నారు.

ఇక ఇదే సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా బెంజ్ అనే సినిమా కూడా రానుంది. కానీ దీనిని మాత్రం మరొక దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కించుకున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా చేస్తున్న ఈ సినిమా యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు నిన్న గ్రాండ్ గా జరిగాయి.

అయితే విషయం ఏమిటంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని బెంజ్ మూవీలో రాఘవ లారెన్స్ కి జోడిగా ప్రముఖ యువ కథానాయిక ప్రియాంక మోహన్ నటించనున్నారు. ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

లారెన్స్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుండగా దీనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. మాధవన్, నవీన్ పౌలి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా ద్వారా తొలిసారిగా ఆమె లారెన్స్ కి జోడీగా నటిస్తున్నారు. మరి ఇది ఎంతమేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే

Follow on Google News Follow on Whatsapp

READ  మెగాస్టార్ కి జోడీగా ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories