Homeసినిమా వార్తలుసరిలేరు నీకెవ్వరులో ఆ పాత్ర నచ్చలేదన్న ప్రకాష్ రాజ్

సరిలేరు నీకెవ్వరులో ఆ పాత్ర నచ్చలేదన్న ప్రకాష్ రాజ్

- Advertisement -

ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయగల సమర్థత ఉన్న నటుడు ప్రకాష్ రాజ్. ఎంతటి క్లిష్టమైన పాత్ర ఇచ్చినా, ఆ పాత్రకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అందుకే ఆయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నేళ్ళు అయినా మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మహేష్ బాబు సినిమాపై ఒకింత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కథలో కొత్తదనం లేకపోయినా.. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సరిగ్గా కుదిరిన పక్కా కమర్షియల్ సినిమాగా ఉండటం వల్ల సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఆ చిత్రం ఘన విజయం సాధించింది.ఆ సినిమాలో ఎన్నో ఏళ్ళ తరువాత ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటించి సినిమాలకు తిరిగి వచ్చారు. ప్రేక్షకులకు విజయశాంతి – మహేష్ బాబు మధ్యన ఉన్న సెంటిమెంట్ యాంగిల్ బాగా నచ్చింది.

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించారు. మహేష్ – ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. తండ్రీ కొడుకులుగా దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. హీరో – విలన్లుగా ఒక్కడు, పోకిరి మరియు బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.

READ  పవన్ కళ్యాణ్ - సముద్రఖని సినిమా ప్రారంభం

అయితే తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో తాను చేసిన పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. తనకు ఆ పాత్ర నచ్చకపోయినా కూడా చేశాను అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. సరిలెరు నీకేవ్వరు సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించిన విషయం తెలిసిందే. ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా ప్రకాష్ రాజ్ కామెడీ మరియు సీరియస్ మిక్స్ చేసిన పాత్రలో నటించారు.

కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఆ పాత్రను తాను అయిష్టంగానే చేసినట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా పాత్ర చేయాలంటే ముందుగా అది మనకు నచ్చి, అందులో పూర్తిగా మమేకమయి ఆసక్తితో చేయాలని.. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేసిన పాత్ర తనకు నచ్చకపోయినా చేయాల్సి వచ్చిందని, ఒక్కోసారి అలా నచ్చని పాత్రను చేయాల్సి వస్తుందని అన్నారు.

ఇటీవలే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఫ్ 2 చిత్రంలో కనిపించిన ప్రకాష్ రాజ్.. ఈ శుక్రవారం విడుదల కానున్న “థాంక్యూ” సినిమాలో కనిపించనున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు నిర్మించే చిత్రాల్లో ప్రకాష్ రాజ్ రెగ్యులర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ ఉంటారు.

Follow on Google News Follow on Whatsapp

READ  త్రివిక్రమ్ చెప్పిన కథ మెచ్చని మహేష్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories