నార్త్ ఇండియాలో ప్రభాస్‌కు విశేషమైన క్రేజ్ ఉంది. కేవలం బాహుబలి సీరీస్ తాలూకు రెండు చిత్రాలతో బాలీవుడ్ ఖాన్‌లతో పోల్చదగిన స్టార్‌ని చేసింది. సాహో, రాధేశ్యామ్ లాంటి రెండు పెద్ద డిజాస్టర్లు వచ్చినా కూడా ఉత్తరాదిలో ప్రభాస్ క్రేజ్ పెద్దగా తగ్గలేదు.
ఓం రౌత్‌తో అతని తదుపరి చిత్రం హిందూ పురాణ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఆదిపురుష్. ఈ మాస్టర్ పీస్ యొక్క టీజర్ ఇటీవల విడుదలైంది మరియు పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్‌కు బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ యూట్యూబ్‌లో దీనికి అసాధారణ వీక్షణలు లభిస్తున్నాయి.
ఇప్పటికే యూట్యూబ్‌లో హిందీ టీజర్‌కు 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ అరుదైన ఘనత సాధించిన రెండో సినిమా ఇది. అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసిన సినిమా టీజర్‌గా కూడా ఆదిపురుష్ టీజర్ రికార్డు సృష్టించింది.
దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ఈ రికార్డ్ బద్దలు కొట్టే గణాంకాలు సూచిస్తున్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు మరింత ఆసక్తి చూపుతున్నారు.
అయితే, టీజర్ లో బ్యాడ్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి వ్యాఖ్యలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చిత్రీకరించబడింది. నిర్మాతలు అదే కారణంతో సినిమా విడుదలను ఆలస్యం చేసారు, వారు సినిమాని విడుదలను హడావిడిగా చేయాలి అనుకోవట్లేదు. మరియు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు.
టీజర్‌కి వచ్చిన వ్యూస్ సినిమా నిర్మాతలకు మరియు చిత్ర బృందానికి ఆశాజనకంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరైన జాగర్తలు తీసుకుని విజువల్ ఎఫెక్ట్స్ ను మెరుగు పరుచుకుంటే మటుకు ఆదిపురుష్ బాక్సాఫీస్ కలెక్షన్లకు ఆకాశమే హద్దుగా ఉంటుంది.
ఆదిపురుష్ సినిమాలో సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఇక దర్శకుడు ఓం రౌత్ యాక్షన్ సన్నివేశాలకు భారీ స్థాయి పీరియాడికల్ నేపథ్యాన్ని జోడించి సినిమాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. దీంతో ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు మరియు ఆ పాత్ర తాలూకు గెటప్ వివాదాలను సృష్టించింది. దీంతో విపరీతమైన హంగామా క్రియేట్ అయ్యింది కానీ ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ ప్రభాస్ సినిమాకి ఊహించని విధంగా ఉంది. ఆదిపురుష్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కాకపోయినా మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు.