పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా తెరకెక్కిన కల్కి 2898 ఏడి మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీలో దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
వైజయంతి మూవీస్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన కల్కి మూవీని యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించారు. అయితే కల్కి అనంతరం ప్రభాస్ లైనప్ లో వరుసగా పలు సినిమాలు ఉన్నాయి. కాగా వాటిలో హను రాఘవపూడి తెరకెక్కించనున్న మూవీ ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుండగా దీనిని రెండవ ప్రపంచయుద్ధ నేపథ్యంలో చిత్రీకరించనున్నారట.
మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీకి ఫౌజి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పరిశీలిస్తున్నారట టీమ్. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు పూర్తి డీటెయిల్స్ త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.