యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా చాలా రోజులుగా వెండితెర పై ఆయన కటౌట్, స్క్రీన్ ప్రెజెన్స్ ను బాగా మిస్ అవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం సాలార్ ఆయన అభిమానులు మరియు ప్రేక్షకుల ఆకలి తీర్చేందుకు సిద్ధమైంది.
ప్రభాస్ నటిస్తున్న ‘ సాలార్’ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు ఈరోజు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీకైన ఆ పిక్స్ లో తన లుక్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఆ పిక్స్ చూసి ఫిదా అవుతున్నారు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని వారు నమ్మకంగా ఉన్నారు.
పాన్ ఇండియా యాక్షన్ సినిమాగా ‘సాలార్’ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు బుధవారం ఆన్ లైన్ లో లీక్ కావడంతో ఆయన అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ పిక్స్ క్వాలిటీ మాత్రం సరిగా లేదు.
కాగా సాలార్ కన్నడ చిత్రం ఉగ్రం రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సక్సెస్ తో మంచి ఊపు మీద దూసుకుపోతున్న ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హింసాత్మక యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్ అయినా సాలార్ పాత్రలో కనిపించనున్నారు.