సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్ల పై పుకార్లు రావడం సర్వసాధారణం. ఒక హీరో – హీరోయిన్ వరుసగా రెండు సినిమాలు చేసినా, లేదా జంటగా పలుమార్లు ఫోటోలకి చిక్కినా చాలు. వాళ్లిద్దరి మధ్య సంబంధం ఉందంటూ పుకార్లు పుట్టుకొస్తాయి. అయితే అలాంటి వాటిల్లో కొన్ని నిజం అయి ఆ హీరో హీరోయిన్లు నిజంగానే పెళ్లి చేసుకున్న సందర్బాలు ఉన్నాయి అనుకోండి. తాజాగా అలాంటి వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది.
ప్రభాస్ మరియు కృతి సనన్ జంటగా చిత్రం ఆదిపురుష్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కాగా. ఈ చిత్రం షూటింగ్‌లో ఇద్దరు నటులు ఒకరినొకరు ఇష్టపడ్డారని ఒక నివేదిక పేర్కొంది. ప్రభాస్ స్వతహాగా తన వ్యక్తిగత జీవితం గురించిన విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు మరియు అతని డేటింగ్, అఫైర్ ల వంటి పుకార్లకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అలాంటి బాహుబలి స్టార్‌తో కృతి పేరు ఇలా చేర్చడం పై అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సెప్టెంబర్ 2020లో, ప్రభాస్ మరియు సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని ప్రకటించారు. ఆ తర్వాత కృతి సనన్ ప్రభాస్ సరసన కథానాయికగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇంతలో, బాలీవుడ్ మీడియా అంతర్గత నివేదికల ప్రకారం, ప్రభాస్ మరియు కృతి మధ్య బంధం కేవలం సహనటుల సంభంధం కాదని, ఇద్దరూ దగ్గరయ్యారని సమాచారం.
నెలరోజుల క్రితమే సినిమా షూటింగ్ ముగిసినప్పటికీ ఇప్పటికీ వారి బంధం చెక్కుచెదరలేదట. ఒకరికొకరు కాల్ లేదా మెసేజ్ చేసుకుంటూ ఉన్నారట. ముందుగానే చెప్పుకున్నట్లు హీరో హీరోయిన్లు కాస్త సన్నిహితంగా మెలిగితే చాలు ఇలాంటి పుకార్లు వస్తాయి. ఇప్పటి వరకూ ప్రభాస్ లేదా కృతి ఈ విషయం పై ఎటువంటి స్పందనా ఇవ్వలేదు.
అసలు ఇదంతా ఎక్కడ మొదలయిందా అని చూస్తే.. ఆదిపురుష్ సినిమాకి ఎంపికైన కొత్తలో కృతి సనన్ గురించి ప్రభాస్ సరదాగా మాట్లాడారు. “నువ్వు బాగానే మాట్లాడాతావ్ కదా అందరూ సైలెంట్ గా ఉంటావు అంటారేంటి” అని కృతి అన్నట్లుగా ప్రభాస్ చెప్పారు. ఆ సమయంలో ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని విని సరదాగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్నారు.
ఇక ఇటీవలే కరణ్ జోహార్ ప్రోగ్రాం కాఫీ విత్ కరణ్ లో కృతి సనన్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఎవరైనా సెలబ్రిటీ కి ఫోన్ చేయాల్సిన అవసరం పడ్డప్పుడు.. కృతి ప్రభాస్ కి ఫోన్ చేయటం జరిగింది. ఆ సమయంలో ప్రభాస్ కరణ్ మరియు కృతితో సరదాగా మాట్లాడారు.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాస్ కృతి ల సాన్నిహిత్యం బయటపడినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయం మళ్ళీ బాలీవుడ్ లో చర్చగా మారింది. మరి ఈ విషయం పై ప్రభాస్, కృతి సనన్ ఏమైనా స్పందిస్తారా లేదా చూడాలి.