Homeసినిమా వార్తలుMultistarrer: బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లో కలిసి నటించనున్న ప్రభాస్ - హృతిక్ రోషన్

Multistarrer: బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లో కలిసి నటించనున్న ప్రభాస్ – హృతిక్ రోషన్

- Advertisement -

మైత్రీ మూవీస్ సంస్థకు చెందిన నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇటీవల బ్లాక్ బస్టర్ పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ను ఒక మెగా హిందీ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసినట్లు ధృవీకరించారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కూడా నటించనున్నారని, ప్రభాస్, హృతిక్ రోషన్ లను అభిమానులు కలిసి చూడబోతున్నారని తెలుస్తోంది.

సిద్ధార్థ్ ఆనంద్ గతంలో హృతిక్ రోషన్ తో వార్ సినిమా చేయగా అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ప్రభాస్ మరియు హృతిక్ కలిసి నటించే ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా 2024లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మల్టీస్టారర్ ఖచ్చితంగా ఇండియన్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ గా నిలుస్తుందని, సిద్ధార్థ్ ఆనంద్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ చూస్తుంటే ప్రభాస్, హృతిక్ రోషన్ ఇద్దరూ తెరపై స్టైలిష్ అవతారంలో కనిపించడం ఖాయమని అంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సాలార్ సినిమాలతో సహా వరుస ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. దీని తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, దర్శకుడు మారుతితో రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్ కూడా ఈ లిస్ట్ లో చేరడంతో ప్రభాస్ కి మరో రెండు సంవత్సరాల వరకు మోస్ట్ ఎలిజిబుల్ ఫిల్మోగ్రఫీ ఉంటుంది.

READ  Megastar Chiranjeevi: పవన్ కళ్యాణ్ పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్

గత కొన్నేళ్లుగా మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ లో చెప్పుకోదగిన పేరుగా వెలుగొందుతోంది. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్స్ తో తెలుగులో భారీ బ్లాక్ బస్టర్స్ ను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఈ గ్రాండ్ బాలీవుడ్ ఎంట్రీతో బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories