Homeసినిమా వార్తలు'కుబేర' : ఆకట్టుకుంటున్న 'పోయిరా మామ' సాంగ్

‘కుబేర’ : ఆకట్టుకుంటున్న ‘పోయిరా మామ’ సాంగ్

- Advertisement -

తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వెర్సటైల్ యాక్టర్ ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కుబేర. మొదట్నుంచి కూడా ఈ క్రేజీ కాంబినేషన్ మూవీపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీసినిమాస్ ఎల్ ఎల్ పి తోపాటు తన అమిగోస్ క్రియేషన్స్ సంస్థపై శేఖర్ కమ్ముల భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి తాజాగా పోయిరా మామ అనే పల్లవితే సాగే మాస్ బీట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని స్వయంగా ఆలపించిన ధనుష్, తన మార్క్ అదిరిపోయేటువంటి స్టెప్స్ తో ఆకట్టుకున్నారు .ఇక సాంగ్ యొక్క లిరిక్స్ అలానే ట్యూన్ కూడా ఆకట్టుకునేలా అందించారు సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.

ముఖ్యంగా ధనుష్ డాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. మాస్ తో పాటు క్లాస్, యువత కూడా ఈ సాంగ్ కి కనెక్ట్ అవుతున్నారు. ఓవరాల్ గా అయితే పోయిరా మామ సాంగ్ ఇప్పటివరకు కుబేర పై ఉన్నటువంటి అంచనాలు బాగానే పెంచేసింది. మరోవైపు ఈ సినిమాని జూన్ 20 గ్రాండ్ లెవెల్ లో పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

READ  SSMB29 Team Ready for Next Schedule నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న SSMB 29 టీమ్

చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావటంతో ఆడియన్స్ లో కూడా ఈ మూవీపై ఎంతో క్యూరియాసిటీ ఉంది. ఇక ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు భారీ లెవెల్లో కుబేర సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ 20న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories