పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో ఏ ఎం రత్నం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “హారి హర వీర మల్లు”. సెప్టెంబర్ 2020 లో మొదలైన ఈ సినిమా మొదట ఏప్రిల్ 29 2022 న విడుదల తేదీగా ప్రకటించారు. అయితే కరోనా వల్ల అన్ని సినిమాల లాగే ఈ సినిమా కూడా వాయిదాల వల్ల ఆలస్యం అయింది.
నిజానికి భీమ్లా నాయక్ చిత్రం కంటే ముందే హారి హర వీర మల్లు రావాల్సి ఉన్నా, రీమేక్ సినిమా కాబట్టి ముందుగా భీమ్లా నాయక్ పూర్తి చేశారు తొందరగా. ఇక తరువాత అయినా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది అనుకుంటే కాస్టింగ్ లో మార్పులు అని కొన్ని రోజులు, స్క్రిప్ట్ లో మార్పులు అని మరి కొన్ని రోజులు ఇలా ఏదో ఒక కారణం వలన షూటింగ్ ఆలస్యం అవుతునే ఉంది.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది. చారిత్రక నేపథ్యం గనుక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసి ఇప్పటికే నిర్మాత ఏ ఎం రత్నం బాగా ఖర్చు పెట్టేశారు. ఫైనాన్స్ నుంచి ఇప్పుడు డబ్బులు వచ్చేలా లేవు. ఫైనాన్స్ ఇబ్బందుల వల్లే ఈ సినిమా షూటింగ్ జరగట్లేదు అనే పుకారు కూడా ఉంది. నిజంగానేషూటింగ్ ఆగిపోతే ఇప్పుడు ఫైనాన్సియర్ లకు డబ్బులు తిరిగి ఇవ్వడం నిర్మాత వల్ల అవని పని,పీకల లోతు కష్టాల్లో కూరుకుపోతాడు.
ఎందుకంటే దసరా నుంచి ప్రజల్లోకి వస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది.పార్టీ పనుల్లో ఆయన బిజీగా ఉండే దశలో ఇంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి అవుతుందా అంటే అని అనుమానమే.ఏదేమైనా నిర్మాత ఏ ఎం రత్నంకు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అనే చెప్పాలి. మరి ఏం చేసి ఆయన ఈ మొత్తం వ్యవహారం నుంచి బయట పడతారో చూడాలి.