పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజీత్ తో ఇటీవలే ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఎంత గానో నచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని వాళ్ళు అనుకుంటున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ శంకర్ ల RC 15 సినిమా సంక్రాంతి నుండి 2024 సమ్మర్ కు వాయిదా పడటంతో… పవన్ కళ్యాణ్ – సుజీత్ సినిమా ఇప్పుడు ఆ డేట్ కు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం భారతీయుడు 2, పవన్ కళ్యాణ్ – సుజీత్ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుండగా, ఈ పోటీలో మరో పెద్ద స్టార్ సినిమా కూడా జత కానుంది.
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఖచ్చితంగా తమ అభిమాన హీరో కెరీర్ లో ఒక భారీ సినిమా అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రానికి టైటిల్ ఇంకా పెట్టకపోయినా ప్రస్తుతానికి OG అని వర్కింగ్ టైటిల్ నియమించారు. కాగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లకు చాలా స్కోప్ ఉంటుంది అని కూడా అంటున్నారు. ఇక జపాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సోదరుడి పాత్రలో ఓ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు.
ఈ సినిమా గురించి ఈ మధ్య కాలంలో కొన్ని రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, ఇలాంటి కథలు మరిన్ని వస్తాయని.. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎటువంటి ఆందోళనకు గురి కావటం లేదు.