Homeసినిమా వార్తలుత్రివిక్రమ్ శ్రీనివాస్ ని వదిలేదు లేదు : పూనమ్ కౌర్

త్రివిక్రమ్ శ్రీనివాస్ ని వదిలేదు లేదు : పూనమ్ కౌర్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరొకసారి తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు నటి పూనం కౌర్. గతంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై రెండుసార్లు ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ గా విమర్శలు చేసిన పూనమ్ కౌర్, ఆయనకు సంబంధించి తాజాగా మరొక పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచారు.

తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పూనంకౌర్ పెట్టిన స్టోరీలో త్రివిక్రమ్ పేరు మెన్షన్ చేసి ఉండటం అలానే ఆయనకు సంబంధించి నటి ఝాన్సీ కి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చానని దాని తాలూకు స్క్రీన్ షాట్స్ ని కూడా జత చేయడం చూడవచ్చు. అయితే తన కంప్లైంట్ ని ఝాన్సీ పట్టించుకోలేదని అన్నారు.

త్వరలోనే ఈ విషయమై మహిళా సంఘంతో మాట్లాడనున్నట్లు ఆమె తెలిపారు. కాగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సినీ ప్రముఖులు అలానే పొలిటికల్ గా కొందరు రక్షణ కవచంగా నిలిచి కాపాడుతున్నారని అతనిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి త్వరలోనే పూర్తి నిజానిజాలు బయటకు వస్తాయని పూనం కౌర్ పోస్ట్ ద్వారా తెలిపారు.

READ  త్రివిక్రమ్ vs అనిల్ రావిపూడి 2026 సంక్రాంతి క్లాష్ ఫిక్స్ ?

ఆ విధంగా మరొకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్, పూనంకౌర్ వివాదం తెరపైకి వచ్చింది. మరి ఇకపై రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా ముందుకు సాగుతుందో, దీనిపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories