కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అలానే టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన వేట్టయాన్ సినిమాలు రెండు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న మాస్ యక్షన్ సినిమా కూలీ.
ఇందులో శృతిహాసన్, ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో నటిస్తుండగా ఈమూవీపై అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా సూపర్ స్టార్ తో లోకేష్ వర్క్ చేస్తుండటంతో రజిని ఫ్యాన్స్ అయితే దీనిపై మరింత భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కూలే సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా దీనిని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేటటువంటి అవకాశం కనబడుతోంది. అయితే విషయం ఏమిటంటే ఇటీవల జైలర్ మూవీలో తమన్నా కావాలయ్యా అనే పల్లవితో సాగె ఒక స్పెషల్ సాంగ్ చేయగా అది మంచి రెస్పాన్స్ అందుకుంది.
తాజాగా కూలీ మూవీలో పూజా హెగ్డే తో కలిసి రజనీకాంత్ ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నారట. ఈ సాంగ్ ని అందర్నీ ఆకట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారట దర్శకుడు లోకేష్. త్వరలో ఈ సాంగ్ షూట్ ని ప్రారంభించనున్నారని అంటున్నారు. మొత్తంగా ఈ సాంగ్ రజిని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా మంచి ఐ ఫీస్ట్ ని అందిస్తుందట.