Homeసినిమా వార్తలుప్రమోషన్స్ లో RRR ను ఫాలో అవుతున్న పొన్నియిన్ సెల్వన్

ప్రమోషన్స్ లో RRR ను ఫాలో అవుతున్న పొన్నియిన్ సెల్వన్

- Advertisement -

మారుతున్న కాలంతో పాటు సినిమాలను ప్రచారం చేసే పద్ధతి కూడా మారుతూ వచ్చింది. సినిమాల కలెక్షన్ లను పెంచేందుకు గానూ చిత్ర నిర్మాతలు ఇప్పుడు నేరుగా మల్టీప్లెక్స్ సంస్థలతో భాగస్వాములవడం అనే కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి వల్ల ఆయా మల్టీప్లెక్స్ సంస్థలు తమతో అధికార భాగస్వాములైన వారి చిత్రాలను చాలా దూకుడుగా ప్రచారం చేయడంతో తమ ధియేటర్లలో ఎక్కువ స్క్రీన్ లు సమకూరుస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ తర్వాత, తాజాగా మణిరత్నం నుంచి రాబోయే చారిత్రాత్మక భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ అదే దారిని అనుసరిస్తుంది.

మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రమోషన్ల కోసం PVR సినిమాస్‌తో జోడీ కట్టింది. ఈ సినిమా కోసం PVR అధికారిక మల్టీప్లెక్స్ పొన్నియిన్ సెల్వన్ సినిమాతో భాగస్వామిగా ఉంటుంది. యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా ఇదే తరహాలో PVRతో అధికారిక భాగస్వామిగా ఉండింది. కాగా ఆ సమయంలో PVR సంస్థలు తమ మల్టీప్లెక్స్‌లను దేశవ్యాప్తంగా PVRRRR గా మార్చి సినిమాను విస్తృతంగా ప్రచారం చేశాయి.

ఆర్ ఆర్ ఆర్ సినిమా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మాయజాలనికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు ఆ సినిమాని థియేటర్లలో మళ్ళీ మళ్ళీ చూడటం వలన PVR సంస్థకు ఎంతగానో కలిసి వచ్చింది. PVR సంస్థకు ఈ టై-అప్ వలన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ద్వారా.. దేశవ్యాప్తంగా PVR ధియేటర్లలో మాత్రమే ఏకంగా 93.7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మరి ఇప్పుడు భారీ హైప్ తో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ కూడా అదే తరహాలో విజయవంతం అయి పీవీఆర్ సంస్థకు లాభాలను అందిస్తుందో లేదో చూడాలి.

READ  కార్తీకేయ - 2 ప్రమోషన్స్ కు రాలేకపోయాను సారీ అంటున్న అనుపమ

పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష శోభిత ధూళిపాళ్లతో పాటు ఇతర ముఖ్య పాత్రలలో భారీ తారాగణం కనిపించనున్నారు.

పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా ప్యాన్-ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రవి వర్మన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం యొక్క మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేసింది.

Follow on Google News Follow on Whatsapp

READ  థాంక్యూ చిత్రంతో దిల్ రాజుకు తీరని నష్టాలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories