Homeసినిమా వార్తలుOTT లో కూడా తమిళ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకొగలుతున్న పొన్నోయిన్ సెల్వన్

OTT లో కూడా తమిళ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకొగలుతున్న పొన్నోయిన్ సెల్వన్

- Advertisement -

సెప్టెంబర్ 30న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం ప్రస్తుతం ‘ఎర్లీ యాక్సెస్’ ఫీచర్ కింద అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకులకు అందుబాటులో ఉంది. దీనర్థం ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లు కూడా ఈ సినిమాను చూడటానికి అదనపు రుసుము (199 RS) చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ నిబంధన కేవలం కొన్ని రోజులు వరకే.. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్ చివరికి నవంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్‌లు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ రకంగా మణిరత్నం దర్శకత్వం వహించిన పీరియాడికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఐదు వారాలకు OTTలో అందుబాటులో ఉంటుంది అన్నమాట.

ఇక పొన్నియిన్ సెల్వన్ థియేట్రికల్ రన్ వైరుధ్యాలతో నిండిపోయింది. తమిళ థియేట్రికల్ రన్ అద్భుతంగా ఉండటంతో పాటు తమిళంలో అద్భుతమైన సమీక్షలను కూడా అందుకుంది. అయితే ఈ చిత్రం తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ రకంగా పొన్నియిన్ సెల్వన్ 1 తమిళంలో ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, కానీ తెలుగు మరియు హిందీలో లాస్ వెంచర్‌గా నిలిచింది.

READ  నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న మహేష్ - రాజమౌళి సినిమా

లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం నుంచి అన్ని భాషల్లో భారీ సంఖ్యలో కలెక్షన్లు వస్తాయని అంచనా వేసింది, అయితే ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా పై పెద్దగా ఆసక్తి చూపలేదు. పొన్నియిన్ సెల్వన్, KGF లాగానే ఇతర భాషలలో OTTలో అయినా భారీ హిట్ అవుతుందని నిర్మాతలు భావించారు.

కానీ OTT విడుదలలో కూడా పొన్నియిన్ సెల్వన్ మంచి ఆదరణ పొందలేక పోయింది. ఇక్కడ కూడా ఈ చిత్రం ఇతర భాషా ప్రేక్షకుల నుండి పేలవమైన సమీక్షలను అందుకుంటుంది. నిజానికి ఈ చిత్రం యొక్క రెండవ భాగం పై గొప్ప అంచనాలను పెంచడానికి ఓటిటిలో భారీ స్థాయిలో ఆదరణ చాలా అవసరం. కానీ ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తుంటే, బాహుబలి2 లేదా KGF2 సినిమాలకు ఇతర భాషల నుండి సీక్వెల్‌కు ఉన్న హైప్ లేనట్లు కనిపిస్తోంది.

పొన్నియిన్ సెల్వన్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచింది. రెండు భాగాల ఫ్రాంచైజీగా రూ. 500 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరించబడిన ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ సంస్థ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది.

చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్, రెహమాన్ మరియు కిషోర్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించి తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

READ  గాడ్ ఫాదర్ సినిమాని ఎవరికీ అమ్మలేదు.. మేమే సొంతంగా రిలీజ్ చేసుకున్నాం - నిర్మాత ఎన్వీ ప్రసాద్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories