Homeసినిమా వార్తలురెండవ రోజు కూడా అద్భుతంగా ఉన్న పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్

రెండవ రోజు కూడా అద్భుతంగా ఉన్న పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్

- Advertisement -

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. దాదాపు ఆయన దర్శకుడు అయినప్పటి నుంచీ ఈ చిత్రాన్ని తీయాలి అనేది ఆయన కలగా ఎన్నో ఏళ్ల నుండి చెప్తూ వచ్చారు. గతంలో ఒకట్రెండు సార్లు పలు స్టార్ హీరోలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు అని వార్తలు వచ్చినా అవేవీ నిజం కాలేదు. ఎట్టకేలకు ఇన్నేళ్ళ తరువాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ వెండితెర మీదకు వచ్చింది.

కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించారు. అందులో మొదటి భాగం శుక్రవారం(సెప్టెంబర్‌ 30న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

తమిళ ప్రజలు, సినీ విశ్లేషకులు ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇది అందరూ ఊహించిన విషయమే. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకోగా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఇక తమిళనాట అనుకున్నట్లు గానే భారీ వసూళ్లు చేసినట్లు ట్రెడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో తొలి రోజు ఓపెనింగ్స్ విషయంలో రికార్ట్‌ కలెక్షన్స్‌ నమోదు చేసిందీ పొన్నియిన్ సెల్వన్.

READ  ధనుష్ 3 సినిమా స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

ఇక అద్భుతమైన ఓపెనింగ్స్ తర్వాత, ఈ చిత్రానికి రెండవ రోజు కూడా కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయి. తమిళనాడులో తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ లో దాదాపు 90 శాతం వరకూ రెండవ రోజు రాబట్టడం విశేషం. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్ల కంటే రెండవ రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ వద్ద కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. పొన్నియిన్ సెల్వన్ ఓవర్సీస్‌లో రికార్డు ఓపెనింగ్స్‌ని నమోదు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల విషయానికి వస్తే, ఈ సినిమా రెండవ రోజు నిలకడగా వసూళ్లను నమోదు చేసుకుంది. కాగా తమిళ ట్రేడ్ వర్గాలు ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే పొన్నియిన్ సెల్వన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ను రాబట్టడం విశేషం. అంతే కాకుండా మూడవ రోజు నాటికి 200 కోట్ల క్లబ్‌లో కూడా చేరుతుందని అంచనా వేస్తున్నారు.

READ  ప్రమోషన్స్ లో RRR ను ఫాలో అవుతున్న పొన్నియిన్ సెల్వన్

కల్కి నవల యొక్క అనుసరణగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్‌ సినిమాకి జయమోహన్ రచయితగా పని చేశారు. మరియు మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్ట్ లో ఐశ్వర్యరాయ్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ తదితరులు నటించారు. రవి వర్మన్ కెమెరా బాధ్యతను తీసుకోగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories