సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం సెప్టెంబర్ 30 న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం అంతటితో ఆగిపోయే సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాట 250 కోట్ల మార్కు వైపు విజయవంతంగా దూసుకుపోతోంది.
ఇక తమిళనాడులో అయితే కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లు దాటేసి మరో అద్భుతమైన రికార్డ్ నెలకొల్పింది. తమిళ సినిమా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ చిత్రం తొలి వారంలో130 కోట్ల గ్రాస్ ను వసూలు చేసే దిశగా పయనిస్తుంది.ఎంత హైప్ తో వచ్చినా.. ఈ రోజుల్లో సినిమాలు తొలి మూడు రోజుల్లో బాగా వసూళ్లు సాధించి తరువాత నెమ్మదించడం మాములుగా జరిగేదే.
కానీ పొన్నియిన్ సెల్వన్ మాత్రం సాధారణ వారం రోజులలో కూడా భారీ కలెక్షనను రాబడుతూ చరిత్ర సృష్టిస్తోంది. మణిరత్నం రూపొందించిన ఏ చిత్రం కూడా ఇంతకి మునుపెన్నడూ ఇంతటి భారీ విజయం సాధించలేదు. ఆయన ఇంతకు ముందు తెరకెక్కించిన క్లాసిక్ సినిమాకు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాయనేది వాస్తవం. ఐతే ఇటీవలి కాలంలో మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఆయన సినిమాల బాగాలేదనేది మాత్రం ఏమంత బాగాలేదనే మాట కూడా నిజమే.
కాగా పొన్నియిన్ సెల్వన్ వీక్ డేస్ లో రాబట్టిన కలెక్షన్లు ఇతర స్టార్ హీరోల తొలి రోజు కలెక్షన్ల స్థాయిలో ఉండటం విశేషం. మంగళవారం ఒక్క రోజే ఈ చిత్రం తమిళనాడులో ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు చేయడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.
ఈ క్రమంలో పొన్నియిన్ సెల్వన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తుంది. ఈ చిత్రానికి కొందరు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, మిగతా ప్రేక్షకుల పై మాత్రం మణిరత్నం మాయాజాలం బాగా పని చేస్తోంది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
మణిరత్నం ఎన్నో ఏళ్లుగా ఆశపడి తెరకెక్కించిన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రసిద్ధి చెందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ, జయం రవి మరియు ఇతర నటీనటుల భారీ తారాగణం నటించింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి భాగం తమిళంతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనూ సెప్టెంబర్ 30 న విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా రెండో భాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని సమాచారం.