Homeసినిమా వార్తలుPonniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 సెన్సార్ రిపోర్ట్ మరియు వివరాలు

Ponniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 సెన్సార్ రిపోర్ట్ మరియు వివరాలు

- Advertisement -

మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ మరో 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు.

విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, జయం రవి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. అశ్విన్ కాకుమాను, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, శరత్ కుమార్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తిబన్, లాల్, మోహన్ రామన్ తదితరులు కూడా నటిస్తున్నారు.

కాగా తాజా సమాచారం ప్రకారం పొన్నియిన్ సెల్వన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాల 33 సెకన్లుగా నిర్ణయించబడింది. ఫస్ట్ హాఫ్ రన్ టైం 1 గంట 19 నిమిషాలు కాగా.. సెకండాఫ్ రన్ టైం 1 గంట 18 నిమిషాలు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు రిపోర్టు కూడా పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం అందుతోంది.

READ  SSMB29: మహేష్ - రాజమౌళి సినిమా బ్యాక్ డ్రాప్ ను ఖరారు చేసిన కీరవాణి

పొన్నియిన్ సెల్వన్ 2 లో త్రిష నటించిన కుందవై కొత్త పోస్టర్ ను నిర్మాతలు బుధవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నగలతో అలంకరించిన త్రిష బంగారు దుస్తులు ధరించి కెమెరా వైపు చూస్తున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వీరరాజ వీరాకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్న పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి, మాటలు: జయమోహన్, కాస్ట్యూమ్స్: ఏకా లఖానీ, మేకప్: విక్రమ్ గైక్వాడ్, కొరియోగ్రఫీ: బృంద.

READ  Allu Arjun: కొత్త సినిమా కోసం చేతులు కలిపిన అల్లు అర్జున్ మరియు సందీప్ రెడ్డి వంగా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories