Homeబాక్సాఫీస్ వార్తలుబాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న పొన్నియిన్ సెల్వన్ దండయాత్ర

బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న పొన్నియిన్ సెల్వన్ దండయాత్ర

- Advertisement -

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించగా తాజాగా విడుదలైన చిత్రమే ‘పొన్నియన్ సెల్వన్’. ఈ భారీ బడ్జెట్ సినిమాకి టాక్ పరంగా కాస్త మిశ్రమ స్పందన వచ్చినా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం మాత్రం ఆగట్లేదు. దీంతో ఈ సినిమాకి అన్ని వైపులా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి.

నిజానికి గతంలో కంటే ఇప్పుడే దక్షిణాది భాషల్లో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతోన్నాయి. ఇందుకు కారణం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సీరీస్ సినిమాలు. ఖచ్చితంగా ఈ సినిమాల వల్లే అలాంటి సినిమాలు తీసి విజయం సాధించవచ్చని అందరికీ నమ్మకం కలిగింది. అంతే కాక దక్షిణ భాషల్లో తెరకెక్కిన అలాంటి చిత్రాలు బాలీవుడ్‌‌ను కూడా డామినేట్ చేస్తూ ఉండటం విశేషం. దీంతో తెలుగు తమిళ దర్శకులు ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలనే ఎక్కువగా రూపొందిస్తున్నారు. అలాంటి కోవలో వచ్చిన మరో చిత్రం పొన్నియిన్ సెల్వన్.

మూడు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద తన హవా తగ్గకుండా దూసుకుపోతుంది.

READ  లూసిఫర్ కి గాడ్ ఫాదర్ కి చాలా తేడా ఉంటుంది: సత్యదేవ్

తమిళనాడులో ఈ చిత్రం సంచలనాత్మక ప్రదర్శనను కొనసాగిస్తుంది. కాగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో 80 శాతం వరకూ ఉండటం విశేషం. ఇక కేరళలో కూడా ఈ చిత్రం మొదటి రోజు వచ్చిన వసూళ్లలో 75 శాతం కొనసాగించడం ద్వారా అద్భుతమైన స్థానంలో ఉంది. అలాగే కర్ణాటకలో అదే ట్రెండ్ కొనసాగిస్తూ మొదటి రోజు వచ్చిన వసూళ్లలో 60 శాతం కంటే ఎక్కువ, హిందీలో కూడా సోమవారం 65 శాతం వరకూ రాబట్టి బాక్స్ ఆఫీసు వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా కొనసాగుతోంది.

అయితే తెలుగులో మాత్రం పొన్నియిన్ సెల్వన్ సోమవారం రోజు దారుణంగా క్రాష్ అయ్యింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం అనే చెప్పాలి. అయితే రేపట్నుంచి దసరా పండగ రోజు మొదలయ్యే నేపథ్యంలో వీకెండ్ కాస్త మంచి కలెక్షన్లు నమోదు చేస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.

ఇక ఓవర్సీస్‌లో పొన్నియిన్ సెల్వన్ ఇప్పటికి అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. మొత్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది.

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది ఇతర భారీ తారాగణం కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

READ  ఓటీటీ విడుదలకు సిద్ధమైన రంగ రంగ వైభవంగా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories