దక్షిణ భారత దిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అసాధారణమైన విధంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు మూడు వారాలు గడిచినా, ఈ చిత్రం కలెక్షన్ల వేటను ఆపే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.. కాగా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఇంకా బలంగా ఉంది.
ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం, దీపావళి పండుగ సీజన్ లో శివకార్తికేయన్ యొక్క ప్రిన్స్ మరియు కార్తీ యొక్క సర్దార్ సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ తమిళనాడులోని థియేటర్లు ఇప్పటికీ పొన్నియన్ సెల్వన్‌ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాయట. పొన్నియన్ సెల్వన్ లాంగ్ రన్ ప్రభావానికి ఇది తార్కాణంగా నిలుస్తుంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది.
తమిళనాడులోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా పొన్నియిన్ సెల్వన్ అద్భుతంగా కలెక్షన్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ గ్రాస్ ఇప్పుడు 19.7 మిలియన్ల దగ్గర ఉండగా, సినిమా రన్ పూర్తయ్యే సమయానికి 20 మిలియన్ల మార్క్‌ను దాటుతుందని అంచనా.
అలా చేస్తే ఓవర్సీస్‌లో 20 మిలియన్ మార్క్‌ను దాటిన 5వ సౌత్ ఇండియన్ సినిమా అవుతుంది. బాహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, 2.0 ఈ ఘనత సాధించిన మిగతా నాలుగు చిత్రాలు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 470 కోట్లకు చేరువలో ఉంది. మరియు 500 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది.
మణిరత్నం దర్శకత్వం వహించిన, పొన్నియిన్ సెల్వన్ అదే పేరుతో కల్కి కృష్ణమూర్తి యొక్క ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన ఒక చారిత్రక కల్పిత గాథ. ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, త్రిష, కార్తీ, మరియు జయం రవి ప్రధాన పాత్రలు పోషించగా, ప్రకాష్ రాజ్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, జయరామ్, శరత్‌కుమార్, పార్తీబన్ సహాయక తారాగణంగా కనిపించారు.
ఆశ్చర్యకరంగా ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో ఎలాంటి అద్భుతాలను చేయలేకపోయింది. మరియు కేవలం సాధారణ స్థాయిలో మాత్రమే ఆడింది. హిందీలో కూడా పెద్ద గొప్పగా లేకపోయినా.. తెలుగు వెర్షన్ కంటే మెరుగైన రన్ సాధించింది, ఎదేమైనా పొన్నియిన్ సెల్వన్-1 భారీ విజయం సాధించి.. నిర్మాతలకు అత్యంత లాభదాయకమైన సినిమాగా నిలిచింది. ఈ సినిమా రెండో భాగాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.